హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైలు కనెక్టివిటీ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం రూ.125 కోట్ల నిధులను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో భాగంగా ‘మెట్రో కనెక్టివిటీ టూ ఓల్డ్ సిటీ’ పథకం కింద ఈ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ జీఓ జారీ చేసింది. మంజూరైన ఈ మొత్తాన్ని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఖాతాకు మళ్లించనున్నారు. ఈ తాజా నిధుల విడుదల పాతబస్తీ మెట్రో విస్తరణ పనుల పురోగతికి దోహదపడనుంది.