Hyderabad Water Grid supply 24 7 Water: హైదరాబాద్‌లో 24/7 తాగు నీటి సరఫరా కోసం వాటర్ బోర్డు రూ.2 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయనుంది. గోదావరి, మంజీర, కృష్ణా, సింగూరు జలాలను అనుసంధానించి, సాంకేతిక సమస్యలు తలెత్తినా నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ఈ గ్రిడ్‌ను రూపొందిస్తున్నారు. గతంలో రూ.8 వేల కోట్లతో ప్రతిపాదించిన ఓఆర్‌ఆర్ పైప్‌లైన్ నిర్మాణానికి బదులుగా ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేయాలని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.