హైదరాబాద్ వాసులకు శుభవార్త.. నగరం మధ్య నుంచి 200 ఫీట్ల రోడ్డు.. ఎక్కడ నుంచి ఎక్కడివరకంటే..

8 months ago 24
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. షేక్‌పేట్ నాలా నుండి మణికొండ పైప్‌లైన్ రోడ్డు మీదుగా సీబీఐటీ వరకు ప్రస్తుతమున్న 60 ఫీట్ల రోడ్డును 200 ఫీట్లకు విస్తరించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఓల్డ్ బాంబే హైవే నుండి ఓఆర్ఆర్ వరకు నేరుగా వెళ్లేలా ఎలివేటెడ్ కారిడార్ కూడా నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాంతం షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఐటీ కంపెనీలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ విస్తరణ వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, సిగ్నల్ లేని ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణం సాధ్యమవుతుంది.
Read Entire Article