అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపల్ మైదానంలో సభ అనంతరం నగరంలోని ఇతర ఫ్లైఓవర్లను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. రాష్ట్రంలో రూ.6,280 కోట్లతో నిర్మించిన 285 కి.మీ జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. ఈ రహదారులు ప్రజల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు.. రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.