హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌తో పాటుగా రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ మేరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు.