Hyderabad Vijayawada Machilipatnam NH 65 Expansion PPPAC Approved: హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం నేషనల్ హైవే 65 విస్తరణలో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు పీపీపీఏసీ క్లియరెన్స్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం కోసం పంపించారు. ఈ ప్రాజెక్టు మూడు ప్యాకేజీలుగా 284 కి.మీ. విస్తరించనున్నారు.. అంచనా వ్యయం రూ.12 వేల కోట్లుగా ఉంది. సీసీఈఏ నుంచి ఆమోదం రాగానే హైవే విస్తరణ కోసం భూసేకరణ, టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు.