హైదరాబాద్‌-విజయవాడ హైవే 6 వరుసలుగా విస్తరణ.. భూసేకరణకు నోటిఫికేషన్‌

4 hours ago 1
హైదరాబాద్‌-విజయవాడ మధ్య ఉన్న ఎన్‌హెచ్‌-65ను ఆరు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. నల్గొండ జిల్లాలో 62.20 నుంచి 126.800 కిలోమీటర్‌ వరకు రహదారి విస్తరణకు భూములు సేకరించనున్నారు. చిట్యాల, నార్కెట్‌పల్లి, కట్టంగూర్‌, నకిరేకల్‌, కేతేపల్లి మండలాల్లోని 13 గ్రామాల్లో 70 సర్వే నంబర్ల పరిధిలో 6.32 హెక్టార్ల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అభ్యంతరాలు ఉంటే 21 రోజుల్లో ఆర్‌డీవోకు తెలియజేయవచ్చు. పరిశీలన అనంతరం తుది నోటిఫికేషన్‌ జారీ చేస్తారు.
Read Entire Article