హైదరాబాద్ శివారు ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు సర్కార్ సిద్ధమైంది. కొత్తగా 6 లైనే హైవే నిర్మాణానికి రెడీ అయింది. బాచుపల్లి-గండిమైసమ్మ మార్గంలో 6.9 కి.మీ. పొడవున ఆరు వరుసల రహదారిని నిర్మించనున్నారు. రూ. 135 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సెప్టెంబర్ మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు భూసేకరణ, అటవీ భూముల బదలాయింపు పనులను వేగవంతం చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు.