హైదరాబాద్ శివారులో రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ పూలు, కూరగాయల మార్కెట్‌ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్‌లో మొత్తం 39.07 ఎకరాలను మార్కెటింగ్ శాఖకు కేటాయించింది. మార్కెట్‌లో శీతల గిడ్డంగులు, ప్లాట్‌ఫారాలు, పార్కింగ్, భారీ భవనాలు, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. ఓఆర్‌ఆర్, శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంగా ఉండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తుల రవాణా, దేశీయ, విదేశీ ఎగుమతులకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.