హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఆరు రకాల అలైన్‌మెంట్‌లతో కూడిన ఈ ప్రతిపాదనలో రోప్‌వే, సొరంగ మార్గం, ఎలివేటెడ్ కారిడార్ వంటి ఎన్నో విధానాలు ఉన్నాయి. దీని ద్వారా ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.