తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించేవారికి తీపి కబురు. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రానుంది. 62.5 కి.మీ మేర హైవే విస్తరణ చేపట్టనుండగా.. కృష్ణా నదిపై అదిరిపోయే ఐకానిక్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే శ్రీశైలానికి 9 కి.మీ దూరాభారం తగ్గనుంది.