హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరనుంది. నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఫ్యూచర్ సిటీలో ఈ సెంటర్ ఏర్పాటు చేస్తుండగా.. అందుకు అధికారులు మూడు ప్రాంతాలను పరిశీలించారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ తెలంగాణలో మెుదటిది.