పొద్దున్నే ఫేస్ బుక్.. మధ్యాహ్నం మెసేంజర్.. ఈవెనింగ్ ఇన్‌స్టాగ్రామ్.. నైట్‌కు యూట్యూబ్.. ఇదీ నేటి యువత రోజూవారీ దినచర్యగా మారిపోయింది. ఈ షెడ్యూల్‌లో అటూ ఇటూ కొంచెం మార్పులు ఉండొచ్చు కానీ.. సోషల్ మీడియా వాడకం మాత్రం కామన్.. సోషల్ మీడియాలో తమ పోస్టులకు వచ్చే కామెంట్లు, లైకులు, షేర్లే ధ్యేయంగా.. ఇన్‌స్టంట్‌గా ఇన్‌స్టాలో వైరల్ అయ్యి ఫేమస్ కావటమే లక్ష్యంగా కొంతమంది యువత.. విపరీత ధోరణులకు పాల్పడుతున్నారు. అలా వ్యవహరించిన ఓ యువకుడికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..