హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల జరిగిన హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో గజం ధర లక్షల్లో పలుకుతోంది. కూకట్‌పల్లిలో ఓ ప్లాట్‌కు గజం రూ.2.98 లక్షలు పలకగా.. తాజాగా (జూన్ 23) గచ్చిబౌలిలో వాణిజ్య స్థలం గజం రూ.2.22 లక్షలకు అమ్ముడైంది. ఈ భారీ ధరలు నగరంలో భూములకు ఉన్న అధిక డిమాండ్‌ను మరోసారి చాటి చెబుతున్నాయి.