ఏళ్లుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 2008 డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త అందింది. 1382 పోస్టుల భర్తీకి సంబంధించి పాఠశాల విద్యా కమిషనర్ గుడ్ న్యూస్ వినిపించారు. 2008 డీఎస్సీకి సంబంధించిన పోస్టుల భర్తీ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ నడుస్తుండగా.. దానిపై సోమవారం (ఫిబ్రవరి 10న) విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా.. పాఠశాల విద్యా కమిషనర్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేయగా.. చివరికి మూడు రోజుల్లో పోస్టింగ్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.