ఎస్ఎల్బీసీ ఆపరేషన్ 21వ రోజుకు చేరింది. ఒక్క మృత దేహం మాత్రమే బయటకు వచ్చింది. మిగతావారి పరిస్థితి ఏంటి..? ఈ నిరీక్షణ ఎన్ని రోజులు ఉంటుంది..? ఒకవైపు టన్నెల్ నుంచి దుర్వాసన వస్తుంది అయినా మిగిలిన వారీ జాడ కనపడటం లేదు. అసలు ఎస్ఎల్బీసీలో ఏం జరుగుతోంది.. ఎప్పటికి మిగతా వారు భయటకు వస్తారు.. అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, రోబోలు ఆపరేషన్ కోసం రంగంలోకి దిగాయి. కానీ కార్మికుల ఆనవాళ్లు కనపడం లేదు.