కేంద్రం చేపట్టిన మరో కార్యక్రమానికి తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం కల్పించింది. నిర్భయ నిధి కింద ములుగు జిల్లాను ఎంపిక చేస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రిని కలిసి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. మహిళలు, బాలికలకు సంబంధించి.. భద్రత, గౌరవం, రవాణా సౌకర్యం కోసం కేంద్రం చేపట్టిన నిర్భయ నిధి పథకంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.