చేపలు పెంపపం బిజినెచ్ చేసేవారికి నిజంగా ఇది గుడ్‌న్యూస్. తక్కువ విస్తీర్ణం, ఖర్చుతో వినూత్న పద్ధతిలో చేపల పెంపకం చేపట్టి లక్షల్లో సంపాదించొచ్చు. అందుకు మత్స్యశాఖ అధికారులు బయోఫ్లాక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కేవలం 250 గజాల స్థలంలోనే ఈ విధానంలో చేపలను పెంచి ఏడాదికి రూ.5 లక్షలు సంపాదించేందుకు ఛాన్స్ ఉంది. ఈ విధానంలో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రాయితీ కూడా ఇస్తుంది.