తిరుపతి శివారు ప్రాంతమైన సూరప్పకాశం సమీపంలోని పద్మావతి నగర్‌లో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (TUDA) 13వ దశ ప్లాట్ల ఈ-వేలాన్ని ప్రారంభించింది. 277 ప్లాట్ల ఈ - వేలాన్ని తుడా గురువారం నుంచి ప్రారంభించింది. సెప్టెంబర్ 17 వ తేదీ వరకూ ఈ- వేలంలో పాల్గొనేందుకు గడువు ఉంది. మరోవైపు పద్మావతి నగర్‌లోని 708 ప్లాట్లకు తుడా ఇప్పటికే వేలం నిర్వహించింది. మిగిలిన 277 ప్లా్ట్లను ఈ - ఆక్షన్ నిర్వహించి 75 కోట్లు సమీకరించాలనే ఆలోచనలో ఉంది.