హుజురాబాద్ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తాను ప్రాణాలు విడిచాడు. బస్సు రన్నింగ్‌లో ఉండగానే హార్ట్ ఎటాక్‌కు గురి కాగా.. రోడ్డు పక్కనే బస్సును ఆపి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. అయితే డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలోనే కన్నుమూశాడు.