పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా హైదరాబాద్‌లో 54 ఏళ్ల తర్వాత మాక్ డ్రిల్ సైరన్ మోగింది. 'ఆపరేషన్ అభ్యాస్' పేరుతో సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్, మౌలాలిలో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు సైరన్ మోగగా.. 12 సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు పాల్గొన్నారు. వైమానిక దాడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సాయంత్రం 4:30 గంటలకు మాక్ డ్రిల్ ముగిసింది.