విద్యుత్ ఉద్యమం తరహాలో పోరాటం.. కలెక్టరేట్ల ముట్టడి, ఇందిరాపార్కు వద్ద ధర్నా: కూనంనేని

2 months ago 11
తెలంగాణలోని నిరుపేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు సాధించడమే లక్ష్యంగా వామపక్ష పార్టీలు విద్యుత్ ఉద్యమం తరహాలో సరికొత్త పోరాటానికి రెడీ అయ్యాయి. హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం, గోపాల్‌పూర్‌లలో పేదల గుడిసెలను అర్ధరాత్రి వేళ అక్రమంగా కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న హనుమకొండలో 10 వేల మందితో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అలాగే జూలై 1న కలెక్టరేట్ల ముట్టడి, జూలై 6న ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టి, సేకరించిన దరఖాస్తులను నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు.
Read Entire Article