హైదరాబాద్‌లోని కుషాయిగూడ ప్రాంతంలో షాపు అద్దె చెల్లించాలని అడిగినందుకు వృద్ధురాలు కమలాదేవిని ఒక యువకుడు దారుణంగా హత్య చేసి.. ఆమె మృతదేహంపై నృత్యం చేశాడు. ఈ అమానుషమైన చర్య సమాజంలో మానవ విలువలు దిగజారుతున్న తీరును తెలియజేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.