Hydra: ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన అంశం హైడ్రా. చెరువులను కబ్జా చేసి పెద్దోళ్లు చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసుకుంటూ వస్తుంటే పేదలు చప్పట్లు కొట్టారు. అయితే, ఇప్పుడు అదే పేదలను హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) భయం వెంటాడుతోంది. 80 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లనూ ఎక్కడ కూల్చివేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. శేరిలింగంపల్లిలో ఓ వ్యక్తి ఇంటి కూల్చివేత ఈ ఆందోళనను మరింత పెంచింది.