ఏపీ ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూ్స్ చెప్పింది. ఆధార్ కార్డుల నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ నెల 20 నుంచి 24వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేసుకోవాల్సిన వారితోపాటుగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవాల్సిన వారు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం నిబంధనల ప్రకారం కనీసం పదేళ్లకు ఓసారి ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.