మాంస ప్రియులకు మరో బ్యాడ్ న్యూస్. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ కొనేందుకు ప్రజలు జంకుతున్నారు. చాలా మంది చికెన్ షాప్ వైపు చూసేందుకు కూడా భయపడుతున్నారు. వైద్యులు, నిపుణులు ఎంత అవగాహన కల్పించినప్పటికీ.. జనాల భయం జనాలది. ఫలితంగా.. చికెన్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో.. చికెన్ వ్యాపారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు చికెన్ మార్కెట్ బంద్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇది ఎక్కడో కాదు ఆదిలాబాద్‌లో మాత్రమే.