వ్యవసాయం కోసం బంగారు రుణాలు ఇచ్చే విషయంలో ఆర్బీఐ కొత్త నిబంధనలు విధించింది. భూమి ఉన్న ప్రాంతంలోని బ్యాంకులే రుణాలు ఇవ్వాలని, ఇతర ప్రాంతాలైతే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో పంట రుణాలు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించి.. రాయితీలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వ్యవసాయం కోసం బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకున్న వారు ఏడాదిలోగా రుణం మొత్తం చెల్లించాలని.. వడ్డీ వరకు చెల్లిస్తే సరిపోదని బ్యాంకులు స్పష్టం చేశాయి. లేదంటే కొత్త రుణం తీసుకోవాలని తెలిపాయి.