తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరుమలలోని ఎస్‌వీ గోశాలకు చేరుకుని గోపూజ చేశారు. అనంతరం గోమాతకు దాణా సమర్పణ చేశారు. గజరాజుల వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు.