పుష్ప2 తర్వాత.. బన్నీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా? అని ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు. యావత్ ఇండియన్ సినిమా లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నిజానికి.. పుష్ప2 తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ.. అనుకోని విధంగా అట్లీ లైన్‌లోకి వచ్చాడు. అసలు.. చూస్తుండగానే కథ ఓకే అవడం, కాస్టింగ్, రెమ్యునరేషన్‌లు ఇలా ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచేస్తున్నాయి. కాగా, నేడు బన్నీ బర్త్‌డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ క్రేజీ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.