Amabati Rambabu: చంద్రబాబుకు తెలియకుండా జీవో వచ్చిందా..

1 year ago 32
చంద్రబాబుకు కాపులపై ఎందుకంత కోపం అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కోర్టు కొట్టేసిన తుని రైలు దహనం కేసును మళ్లీ తిరగతోడితే కాపు సమాజం తరపున ఒక కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. 2014 ఎన్నికలకి ముందు కాపులను బీసీల్లోకి చేర్చుతానని చంద్రబాబు హామీ ఇచ్చారుని.. ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారన్నారు. ఆయన పిలుపుతో అన్ని రాజకీయ పార్టీల్లోని కాపులు మద్దతు తెలిపారన్నారు. తుని సభ సమయంలో రైలు తగలబడితే కాపులే నిప్పు పెట్టారని కేసులు పెట్టారన్నారు. కాపు ఉద్యమ కారుల మీద పెట్టిన కేసులను జగన్ తొలగించారని.. కోర్టు కూడా కేసులను కొట్టేసిందన్నారు. అలాంటి కేసులను తిరగదోడటం వెనుక చంద్రబాబుకు దురుద్దేశం ఉందన్నారు. చంద్రబాబు, హోంమంత్రికి తెలియకుండా జీవో వచ్చిందా అని ప్రశ్నించారు అంబట రాంబాబు.
Read Entire Article