ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయశాఖపై సోమవారం సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో వంద ఎకరాల్లో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు పది వేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని న్యాయశాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.