Minister narayana About Amaravati Capital: అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఎప్పటి నుంచి మొదలవుతాయనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దీనిపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. కంకిపాడులో జరిగిన క్రెడాయ్ సౌత్ కాన్ కార్యక్రమానికి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే 60 వేల కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని మంత్రి చెప్పారు.