ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ వంతు సాయం అందించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే కంకిపాడుకు చెందిన ఓ రైతు అమరావతి నిర్మాణం కోసం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబును కలిసి చెక్ అందించారు. అలాగే విజయవాడకు చెందిన ఓ మహిళ కూడా తన బంగారు గాజులను రాజధాని నిర్మాణం కోసం విరాళంగా అందించారు. ఏపీ రాజధాని కోసం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారిని చంద్రబాబు అభినందించారు.