దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై అమృత వర్షిణి స్పందించింది. నిన్న (మార్చి 10న) కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో.. ప్రణయ్ తల్లిదండ్రులు, అమృత కుటుంబ సభ్యులు, పోలీసులు, న్యాయవాదులతో పాటు మిగతావాళ్లు కూడా తమ స్పందన తెలియజేసినా.. అమృత మాత్రం ఎక్కడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో.. ఈరోజు (మార్చి 11న) అమృత తన ఇన్‌స్టాగ్రాం వేదికగా స్పందించింది.