అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషితాహారం తిని నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే చనిపోయినవారి కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడిన చంద్రబాబు.. ఘటనకు గల కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక అందించాలని ఆదేశించారు.