Anakapalli Another Fire Accident In Pharma Unit: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సెజ్‌లో మరో ప్రమాదం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్థలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పరవాడ ఫార్మా సెజ్‌ల జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుకున్నారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.