Anakapalli: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో.. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే లంచ్ సమయంలో ప్రమాదం జరగడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లు ఫ్యాక్టరీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు.