Anchor Suma: తిరుమలలో యాంకర్ సుమ క్రేజ్ చూశారా?

1 year ago 40
తిరుమల శ్రీవారిని యాంకర్ సుమ దంపతులు దర్శించుకున్నారు. భర్త రాజీవ్ కనకాలతో కలిసి యాంకర్ సుమ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రాజీవ్ కనకాల దంపతులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు వీరికి రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చే సమయంలో పలువురు మహిళా భక్తులు యాంకర్ సుమతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
Read Entire Article