Ten thousand rupees for Private temples For Dhoopam deepam Naivedyam: ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మరో హామీని అమలు చేస్తోంది. ధూప, దీప, నైవేద్యాల కోసం ప్రైవేట్ దేవాలయాలకు రూ.10 వేలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సుమారు ఆరు వేల దేవాలయాలకు గతంలో ధూప, దీప, నైవేద్యాల కోసం రూ.6 వేలు చొప్పున ఇస్తూ వచ్చారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు రూ.10 వేలకు పెంచుతూ జీవో జారీ చేశారు. దీనిపై అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.