సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్‌జెండర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. త్వరలోనే ట్రాన్స్‌జెండర్లకు రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖపై సమీక్ష జరిపిన మంత్రి.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.