నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా ఏడాది లోగా 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ప్రకటించారు. దీనికోసం ప్రతి జిల్లాలోనూ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎనిమిదో తరగతి అర్హతతో గ్రామీణ ప్రాంత యువతకు రూ.5 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకూ రుణాలిస్తామన్న సవిత.. గ్రామీణ యువతకు ఉపాధి కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు .