Nara Bhuvaneswari Donation for Anna canteens: ఏపీలో రేపటి నుంచి ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడకు చెందిన ఓ సంస్థ మంగళవారం అన్న క్యాంటీన్ల కోసం కోటి రూపాయలు విరాళం రూపంలో అందించిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ. కోటి విరాళంగా ఇచ్చారు. ఎన్టీఆర్ మెమొరియల్ ట్రస్టు తరుఫున కోటి రూపాయలను అన్న క్యాంటీన్ల కోసం విరాళంగా అందించారు. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఈ విరాళం తాలూకు చెక్ అందించారు.