ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందింది. పెట్టుబడి రాయితీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై నెలలో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.36 కోట్ల రూపాయలు అందించాలని వ్యవసాయశాఖ సమీక్షలో అధికారులను ఆదేశించారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకంపైనా చంద్రబాబు కీలక సూచనలు చేశారు. మొబైల్ నంబర్లను, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసి జియో ట్యాగ్ చేయాలని స్పష్టం చేశారు.