Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ఈ క్రమంలోనే ఏపీ వాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా వంటి పథకాలను అమలు చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని.. ఇందుకోసం వచ్చే 3 నెలల పాటు అంతా కలిసి జనంలోకి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం వెల్లడించారు.