Anurag Institutions: ఆక్రమణల కూల్చివేతలతో హైదరాబాద్ నగరంలో హైడ్రా అధికారులు.. కొరఢా ఝళిపిస్తున్నారు. శనివారం నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చివేయగా.. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఛైర్మన్‌గా ఉన్న అనురాగ్ ఇన్‌స్టిట్యూషన్స్.. చెరువు భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ అందిన ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే.. హైకోర్టును ఆశ్రయించగా.. చట్టం ప్రకారం నడుచుకోవాలని ధర్మాసనం సూచించింది.