ఏపీవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. సోమవారం నుంచి పరీక్షలు మొదలయ్యాయి. ఈ నెలాఖరు వరకూ పరీక్షలు జరగనున్నాయి. సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం, అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పరీక్షలు రాసేందుకు అమలాపురం ప్రభుత్వ బాలికల హైస్కూల్ వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. అయితే స్కూలు సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా వారంతా గది బయటే ఎదురు చూడాల్సి వచ్చింది.