ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. గవర్నమెంట్ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ బడులకు దీటుగా పది పరీక్షల్లో మార్కులు సాధించారు. అయితే 16 పాఠశాలల్లో మాత్రం ఒక్కరు కూడా పాస్ కాలేదు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం ఊబిచర్ల పాఠశాల నుంచి పది పరీక్షలు రాసిన నలుగురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరికి ఏడుగురు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం విశేషం.