ఏపీ మంత్రివర్గ సమావేశం ఆగస్ట్ 27వ తేదీ జరగనున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనున్నట్లు సమాచారం. అయితే కేబినెట్ భేటీ కోసం సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగిత రహిత కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం మంత్రులకు ఐప్యాడ్‌లు ఇవ్వనున్నారు. ప్రింటింగ్ ఖర్చు తగ్గించడం సహా.. మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశాలు బయటకు లీక్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.