ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ, పలు విద్యుత్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు జరిపారు. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించాలని నిర్ణయించారు. రైతుల సమస్యలపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.