అక్టోబర్ 23వ తేదీ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమైంది. అయితే వారం రోజుల గ్యాప్‌లోనే రెండోసారి భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం హామీ అమలుకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర సూపర్ సిక్స్ హామీలపైనా మంత్రులు చర్చించనున్నారు.